– 68బంతుల్లో 135పరుగులు
– ఈషన్కు నాలుగు, హర్ష్‌కు మూడు వికెట్లు
– ఢిల్లీపై సన్‌రైజర్స్ ఘన విజయం
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ(135నాటౌట్) సెంచరీకి తోడు హెడ్(37), ఇషాన్ కిషన్(25), క్లాసెన్(37నాటౌట్) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో మెరిసారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 242పరుగులు చేసింది. భారీ ఛేదనలో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 195 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీంతో సన్‌రైజర్స్ 47 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. భారత ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు నితీశ్ రాణా(57), సమీర్ రిజ్వీ(41), కెఎల్ రాహుల్(37) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించగా.. సన్‌రైజర్స్ బౌలర్లు ఈషన్ మలింగకు నాలుగు, హర్ష్ దూబేకు మూడు వికెట్లు దక్కాయి. హర్ష్ దూబే వేసిన చివరి ఓవర్లో మూడు వికెట్లు సాధించడం విశేషం.
టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకోగా.. హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ప్రారంభించారు. ఆరంభం నుంచే అభిషేక్ ఢిల్లీ బౌలర్లను సమర్ధవంతంగా నిలువరించాడు. మైదానం నలువైపులా క్లాస్ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 68 బంతులు ఎదుర్కొన్న ఈ యువ సంచలనం, ఏకంగా 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 198.53 స్ట్రైక్ రేటుతో 135 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇది ఈ సీజన్లో అతనికి ఇదే తొలి శతకం. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి బంతి వరకు క్రీజులో నిలబడి, జట్టుకు భారీ స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఎండ్‌లో ట్రావిస్ హెడ్ (37; 26బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (25; 13బంతుల్లో 2ఫోర్లు, సిక్సర్) వేగంగా ఆడి అభిషేక్‌కు చక్కటి సహకారం అందించారు. హెడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 97 పరుగులు, ఇషాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒక దశలో సన్‌రైజర్స్ స్కోరు 250 పరుగులు సులభంగా దాటుతుందని అనిపించింది. అయితే, చివరి ఐదు ఓవర్లలో పరుగులు రాబట్టడంతో సన్‌రైజర్స్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివర్లో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (37నాటౌట్; 3ఫోర్లు, 3సిక్సర్లు) తనదైన శైలిలో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరు 240 మార్కును దాటింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కింది.
స్కోర్‌బోర్డు…
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ (నాటౌట్) 135, హెడ్ (సి)సమీర్ రిజ్వీ (బి)అక్షర్ పటేల్ 37, ఇషాన్ కిషన్ (రనౌట్) నితీశ్ రాణా 25, హెన్రిక్ క్లాసెన్ (నాటౌట్) 37, అదనం 8. (20 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 242పరుగులు.
వికెట్ల పతనం: 1/97, 2/176
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-53-0, నితీశ్ రాణా 4-0-55-0, ఎన్గిడి 4-0-41-0, అక్షర్ పటేల్ 2-0-23-1, కుల్దీప్ యాదవ్ 2-0-30-0, నటరాజన్ 4-0-40-0.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: నిస్సంక (సి)లివింగ్‌స్టోన్ (బి)మధుశంక 8, కెఎల్ రాహుల్ (సి)అబిషేక్ శర్మ (బి)షకీబ్ హసైన్ 37, నితీశ్ రాణా (సి)అభిషేక్ శర్మ (బి)ఈషన్ మలింగ 57, సమీర్ రిజ్వీ (సి)మధుశంక (బి)హర్ష్ దూబే 41, డేవిడ్ మిల్లర్ (బి)ఈషన్ మలింగ 0, స్టబ్స్ (సి)షకీబ్ హుసైన్ (బి)ఈషన్ మలింగ 27, అశుతోష్ శర్మ (సి)అంకిత్ వర్మ (బి)ఈషన్ మలింగ 14, అక్షర్ పటేల్ (సి)నితీశ్ కుమార్ (బి)హర్ష్ దూబే 2,
కుల్దీప్ యాదవ్ (నాటౌట్) 1, ఎన్గిడి (సి)మధుశంక (బి)హర్ష్ దూబే 0,
వికెట్ల పతనం: 1/21, 2/107, 3/107, 4/107, 5/166, 6/186, 7/192, 8/195, 9/195
బౌలింగ్: మధుశంక 4-0-36-1, నితీశ్ కుమార్ 4-0-57-0, ఈషన్ మలింగ 4-0-32-4, షకీబ్ హుసైన్ 4-0-29-1, శివాంగ్ కుమార్ 2-0-28-0, హర్ష్ దూబే 2-0-12-3.
అదరగొట్టిన అభిషేక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



