Wednesday, April 22, 2026
E-PAPER
Homeఆటలుఆయుశ్‌కు గాయం

ఆయుశ్‌కు గాయం

- Advertisement -

ఐపీఎల్‌19కు దూరం
చెన్నై :
ఐపీఎల్‌19లో తడబడుతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ. ఎం.ఎస్‌ ధోనికి పిక్క గాయంతో ప్రథమార్థం మ్యాచ్‌ల్లో మానసిక స్థైర్యం కోల్పోయిన సూపర్‌కింగ్స్‌.. ద్వితీయార్థంలో యువ బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రె సేవలను కోల్పోనుంది. ఈ నెల 18న ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ ఆయుశ్‌ మాత్రె తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆన్‌ఫీల్డ్‌లో ఫిజియో ప్రథమ చికిత్సతో ఆయుశ్‌ మాత్రె బ్యాటింగ్‌ కొనసాగించినా.. గాయం బాధ ఎంతో సేపు క్రీజులో నిలువలేదు. గాయం తీవ్రతతో ఆయుశ్‌ మాత్రెకు కనీసం 6-12 వారాల విశ్రాంతి అవసరం. దీంతో ఈ సీజన్‌ మిగిలిన మ్యాచ్‌కు ఆయుశ్‌ అందుబాటులో ఉండటం లేదని సూపర్‌కింగ్స్‌ సోష్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ‘ఆయుశ్‌ గాయానికి కనీసం 6-12 వారాల రిహాబిలిటేషన్‌ సమయం అవసరం. ఆయుశ్‌ మాత్రె వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఆయుశ్‌ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోలేదు. ప్రత్యామ్నాయ ఆటగాడిని త్వరలోనే తీసుకుంటామని’ సూపర్‌కింగ్స్‌ తెలిపింది. చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఆయుశ్‌ మాత్రె నిలకడగా పరుగులు రాబట్టాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 177.87 స్ట్రయిక్‌రేట్‌తో 201 పరుగులు చేశాడు. సూపర్‌కింగ్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ ఆయుశ్‌ మాత్రెనే కావటం గమనార్హం. సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన సూపర్‌కింగ్స్‌ 2 విజయాలు సాధించి, 4 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -