నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా తెలంగాణ సౌత్ క్యాంపస్ ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపస్ పరిసరాలను పరిశీలించి పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం అపరిశుభ్రంగా ఉండడానికి గమనించి నిత్యం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్య తీసుకోవాలని వార్డెన్ కు తెలిపారు. సౌఖ్యాంపస్ లో బాలికల వసతి గృహంలో అపరిశుభ్రంగా చెట్లు పెరిగి పాములు రావడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు విద్యార్థులు తెలిపారు. అనంతరం ఎంపీడీవో, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి తో మాట్లాడి క్యాంపస్ పరిసరాలను పంచాయతీ సిబ్బంది చేత శుభ్రం చేయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని క్యాంపస్ ప్రిన్సిపాల్, వార్డెన్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగంపల్లి మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్, కార్యదర్శి బాబు, పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
క్యాంపస్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి: మద్ది చంద్రకాంత్ రెడ్డి
- Advertisement -