నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. ఇటీవలె పంజాబ్ లోని అమృత్‌సర్‌లో ఇద్దరు గూఢచారులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూకశ్మీర్ లోని జైళ్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని వార్తలు రావడంతో.. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పూంఛ్ జిల్లాలో ఐదు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత అధికారులు జైళ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు జైళ్లపై అటాక్ చేసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో జైళ్ల భద్రతపై సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు పాక్ సైన్యం నియంత్రణ రేఖ (LoC) వెంబడి మరోసారి కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్ ప్రాంతాల్లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఇండియన్ ఆర్మీ అప్రమత్తమై ఆ కాల్పులను తిప్పికొట్టింది.
జమ్మూలో భద్రతా దళాలు అలర్ట్..ఐదు ఐఈడీలు స్వాధీనం
- Advertisement -
- Advertisement -