Tuesday, November 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం: కేటీఆర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని, మెజారిటీ సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించాలని, ఇది కారు, బుల్డోజర్ మధ్య యుద్ధమని, రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ వైపే చూస్తోందని అన్నారు. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇస్తామన్న రేవంత్ రెడ్డి హామీని ఎద్దేవా చేస్తూ, ఇది కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ నాటకమని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చలేదని, ముసలమ్మలకు, మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు బాకీ ఉన్నాయని, ఈసారి ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -