నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని మోడీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రి హూటాహూటిన జెడ్డా నుంచి భారత్‌కు తిరుగుపయనమయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన మోడీ… ఎయిర్‌పోర్టులోనే అత్యవసర భేటీ నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో సమావేశమై ఉగ్ర ఘటనపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానికి దాడి జరిగిన తీరును వివరించారు. కాగా, ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోడీ అత్యవసర భేటీ
- Advertisement -
RELATED ARTICLES