- Advertisement -
– బీజేపీ నాయకుల విష ప్రచారాన్ని ఖండిస్తున్నా : మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఢిల్లీలో బీసీల ధర్నా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము విషయంలో తప్పుగా మాట్లాడలేదనీ, ఉన్నదున్నట్టే చెప్పానని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విషప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
- Advertisement -