– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రొడ్డ అంజయ్య నిత్య పోరాట యోధుడని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ నివాళులర్పించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రొడ్డ అంజయ్య వర్ధంతి సభను సోమవారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ కూలీ, భూమి పోరాటాలతో పాటు ఉపాధి హామీ పథకం అమలు కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాట యోధుడు అంజయ్య అని గుర్తు చేశారు. ఆయన పోరాట పటిమ నిత్య స్పూర్తివంతమైందని చెప్పారు. ”మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతు, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్‌లో సరైన నిధులు కేటాయించకుండా ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు వసతులు కల్పించడంలో, బిల్లులు సకాలంలో చెల్లించడంలో, పని దినాలు పెంచి, రోజు వారి కూలి పెంచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు, భూమి లేని నిరుపేదలకు గతంలో ఇచ్చిన భూములను భూసేకరణ పేరుతో, కనీసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూడా పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కూలీ, భూమి సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించడమే రొడ్డ అంజయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. కార్యక్రమంలో రైతు శాస్త్రవేత్త ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్, సంఘం నాయకులు శివ, ఆంజనేయులు, విజరు తదితరులు పాల్గొన్నారు.
నిత్య పోరాట స్ఫూర్తి రొడ్డ అంజయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES