నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ మలిదశ విచారణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ దఫా విచారణలో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సదరు ప్రాజెక్టుల నిర్మాణాలకు బాధ్యులుగా వ్యహరించిన వారికి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులకు నోటీసులు జారీ చేసి, వారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.
- Advertisement -