Sunday, May 18, 2025
Homeఅంతర్జాతీయంనేడు కెనడా ఎన్నికలు

నేడు కెనడా ఎన్నికలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేడు కెనడాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి జరుగుతున్న ఈ ఎన్నికల్లో 7.3 మిలియన్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని రికార్డు సృష్టించినట్లు మీడియా పేర్కొంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా లిబరల్‌ పార్టీ, కన్జర్వేటివ్‌ పార్టీ, జగ్మీత్‌సింగ్‌ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్‌ పార్టీ (ఎన్‌డిపి) పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా లిబరల్‌ పార్టీనే గెలుస్తుందని కెనడియన్‌ పోలింగ్‌ సంస్థ (ఇకెఓఎస్‌) రీసెర్చ్‌ అధ్యక్షుడు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఫ్రాంక్‌ గ్రేవ్స్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో లిబర్‌ పార్టీ తరపున ప్రధానిగా మార్క్‌ కార్నీ పోటీ చేశారు. ఈయన గత ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ రాజీనామా అనంతరం మార్చి 14న ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కెనడాపై అత్యధిక పన్నులు విధించడంతోపాటు ఆ దేశాన్ని అమెరికాకు 51వ రాష్ట్రంగా మారుస్తానని హెచ్చరించడంతో కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీగా కన్జర్వేటివ్‌ పార్టీ తరపున పియరీ పోయిలివ్రే పోటీ చేశారు. అయితే లిబరల్‌ పార్టీ కంటే కన్జర్వేటివ్‌ పార్టీ ఈ ఎన్నికల్లో వెనుకంజనే ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -