Wednesday, July 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమాని ఈనెల 10న రిలీజ్ చేయబోతున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఆనందాల వేళ’ అంటూ సాగే పాటను హీరో ఆది విడుదల చేశారు. లిరికల్ వీడియోని వీక్షించి చిత్రయూనిట్‌ను అభినందించారు. ప్రామిసింగ్ ఉందని, టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల గాత్రం.. మణిశర్మ బాణీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసేలా ఈ పాట కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్‌ను గమనిస్తే ఇదొక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా అని అర్థం అవుతోంది.
ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, డీఓపీ : జిజ్జు సన్నీ, ఫైట్స్: రామకృష్ణ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -