హీరో రామ్ పోతినేని దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇది ఆయన నటిస్తున్న 23వ సినిమా. ఈ సినిమా కోసం ఆయన అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇటీవల పుదుచ్చేరి శివార్లలో ఏకంగా 24 గంటల పాటు నిర్విరామంగా షూట్ చేశారు. విశేషం ఏమిటంటే రామ్ కేవలం డైరెక్టర్‌గా కెమెరా వెనుక ఉండటమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నారు.
పుదుచ్చేరిలో ఈ సినిమా కోసం భారీ సెటప్ వేశారు. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో రామ్ నటుడిగా తనపై ఉన్న బాధ్యతతో పాటు, దర్శకుడిగా సినిమాకి సంబంధించిన ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తూ శ్రమిస్తున్నారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అనూహ్యంగా కురిసిన వర్షాల కారణంగా పుదుచ్చేరి షెడ్యూల్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడటంతో యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. మిగిలిన షూటింగ్‌ను అదే భారీ సెటప్‌లో పూర్తి చేసేందుకు త్వరలోనే టీమ్ మళ్లీ పుదుచ్చేరి వెళ్లనుంది. కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. డార్క్, ఇంట్రెస్టింగ్ నియో-నోయిర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ తిరునవుక్కరసు (తిర్రు) కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. యాక్షన్ పార్ట్‌ను విక్రమ్ మోర్, పీటర్ హెయిన్ కలిసి హ్యాండిల్ చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ సినిమా కథకు, భారీ స్కేల్‌కు తగ్గట్టుగా ప్రత్యేకమైన సెట్స్‌ను రూపొందిస్తున్నారు.
ఏకధాటిగా 24 గంటలు షూటింగ్
- Advertisement -
- Advertisement -



