దక్షిణాది మీడియా రంగంలో విశేష ప్రతిభ కన బరిచిన జర్నలిస్టులు, మీడియా సంస్థలు, డిజిటల్ క్రియేటర్ల సేవలను గుర్తించి పురస్కరించేందుకు ‘టీఎన్‌ఐటీ మీడియా అకాడమీ’ ఆధ్వర్యంలో ‘టీఎన్‌ఐటీ సౌత్ ఇండియన్ మీడియా అవార్డ్స్ 2026’ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నటుడు అలీ మాట్లాడుతూ, ‘అవార్డులు నటులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు, మిగతా అన్ని డిపార్ట్‌మెంట్లకు కూడా దొరుకుతుం టాయి. కానీ వాళ్లందరినీ హైలైట్ చేసే ఒక రిపోర్టర్‌కు అవార్డు ఇవ్వాలనే ఆలోచన రావడం చాలా అద్భుతమైన విషయం. మీడియా రంగంలోని అందరికీ అవార్డులు ఇవ్వడంతో పాటు ఒక హెల్త్ కార్డు కూడా ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. దానికి నా సపోర్ట్ కూడా ఉంటుంది. అక్టోబర్ 23న బెంగళూరులో ఈ వేడుక జరుగు తుంది’ అని తెలిపారు. ‘మీడియా సినీ పరిశ్రమ లోని కళాకారులను ప్రోత్సహిస్తుంది. వాళ్లు లేక పోతే మాకు గుర్తింపు లేదు. అలాంటి మీడియాను సన్మానించడం చాలా ఆనందంగా ఉంది’ అని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు.
నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ, ‘మీడియా అనేది పరిశ్రమకు ఎంతో అవసరం. అలాంటి మీడియాను గుర్తించి అవార్డులు ఇవ్వడం అభినందనీయం’ అని చెప్పారు.
రఘు భట్ మాట్లాడుతూ, ‘మీడియాలోని అన్ని క్యాటగిరీల వారికి, అలాగే ప్రింట్ మీడియాకు కూడా అక్టోబర్ 23న బెంగళూరలో అవార్డులు అందజేస్తాం’ అని తెలిపారు.
అరుదైన అవార్డుల వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



