ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతా కాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో కథానాయిక వైష్ణవి చైతన్య మీడి యాతో పలు ఆసక్తికర విషయా లను పంచుకున్నారు. ఇందులో నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉం టుంది. కానీ కుటుంబం వల్లో, సమాజం వల్లో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితం లో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అదే నా పాత్ర. నేను ఎంచుకునే కథలో, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకో గలగాలి. ఈ సినిమాని ఎంచు కోవడానికి కారణమదే.దర్శకుడు ఆదిత్య జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఈ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ప్రతి లవ్ స్టోరీ లోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఇందులోనూ ఆ ప్రత్యేకత ఉంది. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపిం చింది అనేది ఇందులో ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి హాయిగా చూడొచ్చు. సితార బ్యానర్‌లో నితిన్ సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళంలో రెండు, హిందీలో ఒక సినిమాలో నటిస్తున్నాను.
‘కడలి’ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



