Tuesday, September 8, 2026
E-PAPER
Homeఖమ్మంఅసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం హేయం 

అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం హేయం 

- Advertisement -

– దీనిపై గంగారంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన
నవతెలంగాణ-సత్తుపల్లి 

శాసనసభ ముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ గంగారంలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన తెలిపారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పై ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను, అసభ్యకర పదజాలాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా పోలీసులపై దాడికి పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గంగారం సర్పంచ్ కాకర్ల రేవతి, గ్రామ శాఖ అధ్యక్షుడు కావేటి అప్పారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ కాంగ్రెస్ నాయకులు కోలగట్ల చెన్నకేశవరావు, కావేటి అప్పారావు, బెజవాడ శ్రీనివాసరావు, బండారు మారేశ్వరరావు, కరాటే రమేష్, యామాల ముత్యాలరావు, కాకర్ల మాణిక్యాలరావు జల్లిపల్లి వాసుదేవరావు, కోటమర్తి జవహర్లాల్, చిన్ని వెంకటేశ్వరరావు, కాలసాని నాగేశ్వరరావు, రాచమళ్ల నాగేంద్రరావు, బండారు జగదీష్, కువ్వారపు కన్నయ్య, ఎస్కే సుభాని, కువ్వారపు గిరిబాబు, చల్లారి సత్యనారాయణ, కొండపల్లి మహేష్, బెజవాడ మనోజ్, మొగిలిచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -