నవతెలంగాణ-హైదరాబాద్: ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు హకీంపేట వద్ద అరెస్ట్ చేశారు. వారిని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద అగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంటికి కూడా మేం పోవద్దా అంటూ పాడి కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ వాగ్వాదం నెలకొంది. పోలీసులు తమ వాహనాలను అడ్డుకోవడంతో బొల్లారం చౌరస్తా నుంచి ఎర్రవెల్లి వైపు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు పాదయాత్రగా బయల్దేరగా వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
హరీశ్ రావు, కేటీఆర్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



