- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పీఎస్ రాజు అకస్మాత్తుగా కుప్పకూలడంతో మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. పరిస్థితిని గమనించిన మంత్రి ఆలస్యం చేయకుండా రాజుకు CPR చేసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి, రాజును వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మానవత్వం చాటుకున్నారని పలువురు పేర్కొన్నారు.
- Advertisement -


