Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతాగుబోతుల దాడి..గిటారిస్ట్ మృతి

తాగుబోతుల దాడి..గిటారిస్ట్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ శివారు ప్రాంతంలో నివసిస్తున్న ప్రముఖ గిటార్ ఆర్టిస్ట్ చోంగ్తమ్ విక్రమ్ సింగ్‌పై ఆదివారం రాత్రి తాగుబోతుల ముఠా దాడి చేసింది. ఇంటి ముందు వీరంగం చేస్తున్న వారిని అడ్డుకోవడానికి వెళ్లిన విక్రమ్‌పై 8 మంది వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల విక్రమ్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, సోమవారం చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇంపాల్‌కు చెందిన విక్రమ్ సింగ్ ఢిల్లీలో మ్యూజిక్ స్కూల్ నిర్వహిస్తూ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -