Tuesday, September 8, 2026
E-PAPER
Homeఆటలుఏకైక టీ20 మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన జపాన్

ఏకైక టీ20 మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన జపాన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ ప్రపంచంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, తొలిసారిగా జపాన్‌తో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇరు దేశాల మధ్య 75 ఏండ్ల దౌత్య సంబంధాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 22న టోచిగి ప్రిఫెక్చర్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం జపాన్ తమ జట్టును ప్రకటించింది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టునే ఈ మ్యాచ్‌కు కూడా ఎంపిక చేయడం విశేషం. టీ20 ఫార్మాట్‌లో జపాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ జేక్ కుసుడా-నైర్న్ తొలిసారిగా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
జపాన్ జట్టు:
కెండెల్ కడోవాకీ-ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హరా-హింజే, బెంజమిన్ ఇటో-డేవిస్, అలెస్టిర్ కడోవాకీ-ఫ్లెమింగ్, కోహె కుబోటా, జేక్ కుసుడా-నైర్న్, వటారు మియౌచి (వికెట్ కీపర్), రియో సకురానో-థామస్, అలెక్స్ షిరాయ్-పాట్‌మోర్ (వికెట్ కీపర్), షోమా సుగయా-స్లేటర్, డెక్లాన్ సుజుకీ-మెక్‌కోంబ్, సుయోషి టకాడా, ఇబ్రహీం తకహాషి, మకోటో తానియామా, లాచ్‌లాన్ యమమోటో-లేక్.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -