- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోలీసు నియామక మండలి శుభవార్త చెప్పింది. అభ్యర్ధులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పోలీస్ శాఖలో 7,437 పోస్టులకు జూలై 29న ప్రభుత్వం 4 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 9వ తేదీతో గడువు ముగియనుండగా.. ఈ గడువును మరో వారంరోజులపాటు పొడిగిస్తున్నట్లు పోలీసు నియామక మండలి ప్రకటించింది. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -



