- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో మంగళవారం 85వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. వివిధ అంశాలపై పరిశోధన చేసిన స్కాలర్లలకు వర్సిటీ ప్రధానాచార్యులు, రాష్ట్ర గవర్నర్ శివ ప్రసాద్ శుక్లా పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా చరిత్ర విభాగంలో నల్గొండ జిల్లాకు చెందిన గుర్రం లక్ష్మణ్, కామారెడ్డి జిల్లాకు చెందిన వీసంపల్లి పొతన పీహెచ్.డీ పట్టాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఆచార్యులు, కుటుంబసభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.

- Advertisement -



