నవతెలంగాణ – జుక్కల్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు నిరసనగా జుక్కల్లో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల జరిగిన వ్యవహారాన్ని నిరసిస్తూ జుక్కల్లో బీఅర్ఎస్ నాయకులు, మహిళలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, పోలీసుల వ్యవహారశైలిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా ప్రజాప్రతినిధి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని ఆందోళనకారులు మండిపడ్డారు.
మహిళలకు, మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై కఠినంగా స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జుక్కల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మహిళలు, బీఅర్ఎస్ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మహిళా ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.



