- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని కేంరాజ్ కల్లాలి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ సుంకరి వెంకట్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం వారి గ్రామానికి వెళ్ళి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతంలో సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం గ్రామాధ్యక్షునిగా కొనసాగుతుండడం గర్వంగా ఉందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



