Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏం చేద్దాం..ఎలా చేద్దాం.?

ఏం చేద్దాం..ఎలా చేద్దాం.?

- Advertisement -

ఉపాధి కల్పనలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట
ఈ నెల 15లోగా వీబీజీ రాంజీ గ్రామసభల నిర్వహణ
నవతెలంగాణ – మల్హర్ రావు

కూలీల ఉపాధి కల్పనలో వారి అభిప్రాయానికే పెద్దపీట వేయనున్నారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రారంభమైన వీబీజీ రాంజీ పథకంలో వికసిత్ భారత్- 2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇప్పటికే మండల వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తుండగా ఈ నెల 15లోగా పూర్తి చేయనున్నారు. గ్రామ పంచాయతీల వారీగా 2026-2027 సంవత్సరానికి చేపట్టాల్సిన పనులను గుర్తించి, ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. నిబంధనలకు అనుగుణంగా నాలుగు కేటగిరిల్లో జాబితా సిద్ధం చేసి 2027 మార్చి నాటికి పనులను పూర్తి చేయనున్నారు.

నాలుగు విభాగాలకు ప్రాధాన్యం
వీబీ జీ రామ్ జీ పథకంలో భాగంగా 318 పనులను అధికారులు సూచిస్తున్నారు. వీటిని నాలుగు విభాగాలుగా చేశారు. నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి వసతులు, విపత్తుల నివారణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పనులు గుర్తించనున్నారు. గ్రామంలో ఎంపీడీవో లేదా ఏపీవో లేదా టీఏలతో బృందాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో మొదటి, తుది గ్రామసభలు నిర్వహించాలి. మొదటి గ్రామసభలో వీబీ జీ రామ్ జీ ద్వారా కల్పించే పనులపై కూలీలకు అవగాహన కల్పించాలి. వివిధశాఖల అధికారులు విధిగా హాజరై తమశాఖకు అవసరమైన పనులు గుర్తించి ప్రణాళికలో చేర్పించాలి. తుది గ్రామసభలో గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో సూచిస్తూ విక సిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ఆమోదం చేపట్టాలి. చివరి గ్రామ సభలో ప్రతిపాదిత పని పేరు, లబ్ధిదారుడి వివరాలు, అంచనా వ్యయం, చేపట్టబోయే శాఖ, పనులు చేపట్టే ఆర్థిక సంవత్సరం వివరాలను రూపొందించాలి.

బృందాల వారీగా పనులు..
వీబీ జీ రామ్ జీలో ప్రస్తుతం 22 శాఖలను అనుసంధానం చేశారు. ప్రధానంగా పంచాయతీ రాజ్, అటవీ, సెర్ప్, వ్యవసాయం, విద్య, మత్స్య, ఉద్యాన శాఖ, టీజీ రెడ్కో, డెయిరీ, గృహనిర్మాణ, సెరీకల్చర్, ఎస్బీఎం తదితర శాఖలను అనుసంధానం చేస్తూ పనులను కల్పించనున్నారు. మండలంలోని 15 గ్రామాల్లో 8,495 జాబ్ కార్డులు ఉండగా,18873 మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో  10,632 జాబ్ కార్డుల్లోని కూలీలు పనులకు వస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 392 కుటుంబాల్లోని 5,362 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవగా  96,490 వేల పనిదినాలు కల్పించారు. 565 పనులను చేపట్టి 250 పైగా పనులను పూర్తి చేశారు. మిగతా పనులు కొనసాగుతుండగా కూలీలకు వేతన రూపంలో రూ.2.80కోట్లు అందించారు. ఈ సారి పెరిగిన కూలీల పని డిమాండ్ కు అనుగుణంగా పనిదినాలను కల్పించేలా పనుల ప్రణాళికను తయారు చేయనున్నారు.

గుర్తించనున్న పనులివే..
గ్రామాభివృద్ధికి ఉపయోగపడే పనులను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. నీటి సంరక్షణ పనులు, నీటిపారుదల కాలువల పూడికతీత, కందకాలు, నీటి కుంటలు, సమగ్ర భూ అభివృద్ధి పనులు, పశు సంబంధిత పనులు, గ్రామీణ పారిశుధ్యం, హరితహారం, రహదారుల అనుసంధానం, పంట నూర్పిడి కల్లాలు, ఎండిపోయిన బావుల రీచార్జి తదితర పనుల గుర్తింపు చేపడుతున్నారు. పనుల గుర్తింపు తరువాత జీపీఎస్ కోఆర్డినేట్ చేయనున్నారు. పనులు చేసే ప్రదేశానికి వెళ్లి యాప్లో చిత్రాన్ని అప్లోడ్ చేయడం ద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పనులు గుర్తించిన ప్రదేశం తెలుస్తుంది. ఉపాధి పనుల్లో పారదర్శకత కోసం ఈ విధానం అవలంభిస్తున్నారు. గ్రామ సభల తీర్మాణం మేరకు పనులను గుర్తిస్తామని, కూలీలకు చేతినండా పని దొరికేలా ప్రణాళికలు రచిస్తున్నామని అధికారులు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -