Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
ప్రజా సమస్యలు, పాలనను గాలికొదిలి అమలుకానీ హామీలిచ్చి గద్దెనెక్కిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎండి. ఖలీల్ అన్నారు. సోమవారం గుండాల లో బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అసెంబ్లీలో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం సబబు కాదని నల్ల దుస్తులు ధరించడం తప్పాని పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో నలదుస్తులు ధరిస్తే తప్పులేదు కానీ  వాస్తవాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం అయితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు చిప్పలపల్లి యాదమ్మ, గడ్డమీది మహోదయ్, నాయకులు మద్దుల బాల్ రెడ్డి, సంఘీ బాల కృష్ణ,మాదరబోయిన రామ్మల్లు,గిరి కత్తుల శ్రీనివాస్,అశోక్ రెడ్డి,అన్నెపర్తి బిక్షం,శ్రీరాముల ఉదయ్,ఎ శివ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -