నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్షయ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సర్పంచ్ కోడూరి సాయ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు బాగా రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఇస్తారి, పిల్లి సంతోష్, ఆర్గనైజింగ్ డైరెక్టర్ రజిత రెడ్డితో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉచిత కుట్టు మిషన్ కార్యక్రమం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



