ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాకాల మౌనిక, హరీష్, యాట శివ, బీజని మధుకుమార్, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, జనరల్ సెక్రటరీ కుండే సంపత్, జూకంటి చిన్న ఉప్పలయ్య, కూతాటి అంజన్‌కుమార్, ఎండీ ఫయాజ్, ఎలుగల హరికృష్ణ, హరిగా చంద్రశేఖర్, మొగిలిపాక కృష్ణ, దొంతుల ఎల్లేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్రీవెన్స్ డేలో బీఆర్ఎస్ నిరసన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



