Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరోసారి సర్ గడువు పొడిగింపు

మరోసారి సర్ గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి సమగ్ర ఓటర్ జాబితా(సర్) ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం పెంచింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణకు ఉన్న గడువును పొడిగించింది. ముందుగా ఈ నెల 16 వరకు ఉన్న గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు తెలిపింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల స్వీకరణ అనంతరం వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రక్రియను నవంబర్ 5లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. క్లెయిమ్స్‌, అభ్యంతరాల పరిష్కారం పూర్తైన తర్వాత నవంబర్ 9న తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -