నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్‌ను కలిసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంఘీభావం తెలిపారు. ఈక్రమంలోనే స్పీకర్ భావోద్వేనికి గురైయ్యారు. స్పీకర్ గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. బీజేపీకి కూడా బాధ్యత ఉందని చెప్పారు. బీజేపీ నేతలు సభకు సహకరించాలని కోరారు. స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు అవమానించడంపై బీజేపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ రూల్స్ పాటించలేదని.. ఇప్పుడు ప్రతిపక్షంలోనూ రూల్స్ పాటించట్లేదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహించారు. అయితే, స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను సీఎంవో విడుదల చేసింది.
అసెంబ్లీలో స్పీకర్ కంటతడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



