Monday, September 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఫార్డి (బి)లో మరో విషాదం.. 

ఫార్డి (బి)లో మరో విషాదం.. 

- Advertisement -

వారం రోజులుగా అస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు..
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్డి (బి) గ్రామంలో మరో విషాదం చోటు చేసుకుంది. గత సోమవారం పార్డి (బి) గ్రామానికి చెందిన పలువురు శ్రావణ సోమవారం మహారాష్ట్ర లోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి జీపులో వస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు తిరిగిరాని లోకానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురిలో సాకలి శంకర్‌ (67)ను మెరుగైన వైద్యం కొరకు నిజామాబాదు, అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో గత వారం రోజులుగా ప్రాణాలతో పోరాడి చివరకు సోమవారం తుది శ్వాస విడిచారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -