Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలి

కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలి

- Advertisement -

కనీస వేతనాల సలహా బోర్డు నుండి సిఐటియును మినహాయించడం దుర్మార్గం
కార్మిక వ్యతిరేక మోడీ విధానాలు నశించాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు
నవతెలంగాణ – సంగారెడ్డి

కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలనీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలని సీఐటీయూ ఆఫీసు నుండి బస్టాండ్ వరకు నిరసన ర్యాలీగా బయలుదేరి న్యూ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా జి. సాయిలు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ కార్మికులను రోడ్డుపాలు చేస్తున్న మోడీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ కార్మికులకు అండగా నిలుస్తున్న సీఐటీయూకు కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో ప్రాతినిధ్యం కల్పించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కష్టపడుతున్న కార్మికునికి కనీస వేతనం ఇవ్వాలని అడిగే దమ్మున్న సీఐటీయూను దూరం చేస్తే తన ఇష్టానుసారం వేతనాలు ఇవ్వడానికి ఉంటుందని, కావాలని సీఐటీయూ, ఏఐటియుసి, ఐఎన్టీయూసీని లను సలహా మండలిలో నియమించలేదని మండిపడ్డారు. వెంటనే పునరాలోచించి కనీస వేతనాల సలహా మండలిలో సీఐటీయూకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు రాజయ్య, యాదగిరి సురేష్ మంజుల, నాయకులు శ్రీధర్, మోహన్ రెడ్డి, శివ, లక్ష్మణ్, సుజాత, యాదయ్య, గోపాల్, అనిల్, నర్సింలు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -