నవతెలంగాణ-కుభీర్
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని మండల కేంద్రమైన కుభీర్ లోని సబ్ స్టేషన్ ముందు, బైంసా-కుభీర్ రహదారిపై సోమవారం రైతులు ఆందోళన, ధర్నా చేపట్టారు. ఈ వర్షాకాలంలో వ్యవసాయానికి తగినంత మేర వర్షాలు కురవకపోవడంతో నీళ్ళు లేక పంటలు పొలాలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటారు ద్వారా పంటకు నీళ్లు పారిద్దామంటే కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు వస్తుందో..తెలియని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. విద్యుత్ పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు ముందస్తు సమాచారం లేకుండా కరెంటు కోతలు విధించడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఏడీ మోహన్ కుమార్, ఏఈ కదం ఆదిత్య రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. కాగా.. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి బందోబస్తు చేపట్టారు.
సబ్ స్టేషన్ ముందు రైతుల ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



