Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసారంపల్లి మల్లారెడ్డి అంటే నాకు ఎంతో అభిమానం : సీఎం రేవంత్‌

సారంపల్లి మల్లారెడ్డి అంటే నాకు ఎంతో అభిమానం : సీఎం రేవంత్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రముఖ రైతునేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమంలో సారంపల్లి మల్లారెడ్డి స్మృతి గీతాలు సిడిని ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతులకోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మరణం రైతాంగానికి తీరని లోటని అన్నారు.

సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరన్నారు. కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారు భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్ సైక్లోపీడియా సారంపల్లి. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యలను మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సారంపల్లి మల్లారెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు ఎంతో అభిమానం అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -