నవతెలంగాణ-హైదరాబాద్ : అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి భవన్‌కు తరలించారు.
నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో జగదీశ్ రెడ్డి కింద పడటంతో అతని కాలికి గాయమైంది. పోలీసుల తోపులాటలో కేటీఆర్ చేతికి, నుదిటికి గాయాలయ్యాయి. పోలీసులతో జరిగిన తోపులాటలో హరీశ్‌రావు కిందపడ్డారు. ఈ ఘటన అనంతరం నల్ల టీషర్టులతో అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో హరీశ్‌రావు టీషర్ట్ విప్పి బనియన్‌తో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.


