- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. నెల రోజుల కిందట కిలో రూ.30-50 ఉండగా, ప్రస్తుతం రూ.70-80కి చేరింది. తెల్ల ఉల్లి ధర కిలో రూ.100 దాటింది. హైదరాబాద్ మలక్‌పేట హోల్‌సేల్ మార్కెట్లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు పలుకుతోంది. ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటకలో దిగుబడి తగ్గడం, డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. లోకల్ పంట మార్కెట్లోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
- Advertisement -



