Monday, September 7, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..సూసైడ్ నోట్

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం..సూసైడ్ నోట్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ ఆత్మహత్యా యత్నం చేసినట్టు ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మరో ఫోక్‌ సింగ ర్‌ ఈశ్వర్‌సాయిని పట్టుకోవడంలో పోలీ సుల నిర్లక్ష్యమే ఈ నిర్ణయానికి కారణమని ప్రచారం జరిగింది. ఈశ్వర్‌సాయి తనను పెండ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని గత నెల 21న నార్సింగి పోలీసులకు మాధు రి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు సకాలంలో స్పందించడం లేదంటూ రెండు రోజుల తర్వాత ఆమె ఇంటిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించినట్టుగా తెలిసింది.

ఈ క్రమంలో ఆమె రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. ‘అమ్మ నాన్నకు సారీ.. నాకు బతకాలనే ఆశ లేదు. నేను తప్పు చేశాను.. దీనికి నా చావే పనిష్మెంట్’ అని సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -