నవతెలంగాణ-హైదరాబాద్ : నగర పరిధిలోని తుక్కుగూడలో సంచలనం సృష్టించిన నర్సు హత్య ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ అఘాయిత్యంపై సమగ్ర విచారణ నిమిత్తం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దర్యాప్తు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్ నివేదికలు, టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ, తదితర అంశాలను వేగవంతం చేసి, పక్కాగా సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలయ్యేలా పోలీసులు కేసును దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.
తుక్కుగూడ నర్సు హత్య..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



