నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు శ్రావణమాస చివరి సోమవారం శుభదినం సందర్భంగా ఇండ్ల ప్రారంభోత్సవాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాసు సాయిలు ప్రారంభించారు. అదేవిధంగా డోంగ్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్ ప్రారంభించారు. ఇండ్ల ప్రారంభోత్సవాలకు హాజరైన నాయకులకు లబ్ధిదారుల కుటుంబాలు శాలువాలతో ప్రత్యేకంగా సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఆయా మండలాలు సర్పంచులు పాల్గొన్నారు.
మద్నూర్, డోంగ్లి, మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



