Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి ఫిర్యాదులపై స్పందన కరువు

ప్రజావాణి ఫిర్యాదులపై స్పందన కరువు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
గ్రామాల్లోని ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు వారాల క్రితం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్యలపై అధికారులు ఇప్పటికీ సమాధానం చెప్పలేదని, సమస్యను పరిష్కరించలేదనీ, ఇంకెప్పుడు స్పందిస్తారని పలువురు ఫిర్యాదుదారులు, బీజేపీ మండలాధ్యక్ష‍ులు తుకారం ఎంపీడీఓ సాయిలును ప్రశ్నించారు. దీనిపై ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించామనీ, వారి నుంచి స్పందన వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తామని చెప్పారు. ఫిర్యాదులను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -