బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-అచ్చంపేట
వ్యాసరచన పోటీలు విద్యార్థులలో పోటీ తత్వాన్ని, పుస్తక పఠనాన్ని పెంచుతాయని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మద్దెల బండ సాయిబాబు అన్నారు. సోమవారం పట్టణంలో అన్ని పాఠశాలల, కళాశాలలో విద్యార్థులకు భోజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. దాదాపుగా 200 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారన్నారు. మత్తు పదార్థాలు అనే అంశాన్ని ఎక్కువ మంది విద్యార్థులు రాసినట్లుగా తెలిపారు. రాబోయే కాలంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి, వారి నైపుణ్యాలను వెలికి తీసేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తాలూకా అధ్యక్షులు కాంపల్లి ఆంజనేయులు, శ్రీశైలం, చంటి, చింటు, మహేష్, సుభాష్ లు పాల్గొన్నారు.
వ్యాసరచన విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచుతాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



