Monday, September 7, 2026
E-PAPER
Homeజిల్లాలునల్లమల్లలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

నల్లమల్లలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

- Advertisement -

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్ధం సైదులు
నవతెలంగాణ-అచ్చంపేట
నల్లమల్ల ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సీపీఐ(ఎం) అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లమల్ల ప్రాంతంలో అపారమైన సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నప్పటికీ వాటిని ఆధారంగా చేసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడుతోందన్నారు. నియోజకవర్గంలోని చదువుకున్న యువతకు స్థానికంగా సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం నల్లమల్ల ప్రాంతంలో పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణహిత పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక వనరులను వినియోగించుకోని పరిశ్రమలను ప్రోత్సహిస్తే రైతులకు, యువతకు, కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక పారిశ్రామిక ప్రణాళిక రూపొందించి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వర్ధం సైదులు డిమాండ్ చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే వరకు సీపీఐ(ఎం) ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -