నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ మండలంలోని వాడియాల గ్రామంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ఉపవాస దీక్షలు చేపట్టి, సాంప్రదాయ పద్ధతిలో బోనాలను తయారు చేశారు. వైభవంగా బోనాల ఊరేగింపుగ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించడానికి మహిళలంతా నైవిద్యంతో వండిన బోనాలను నెత్తిన ఎత్తుకుని ఆలయానికి తరలివచ్చారు. రంగురంగుల దుస్తులు ధరించిన మహిళలు, చిన్నారులతో పాటలు పాడుతూ, శివసత్తుల పూనకాలు బోనాల ఊరేగింపు పొడవునా డప్పు చప్పుళ్లు, మోతలతో మార్మోగింది. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువకులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గోవింద గోపాలని అమ్మవారికి ప్రత్యేక పూజలతో ఆలయానికి చేరుకున్న భక్తులు పోచమ్మ తల్లికి బోనాలను నైవేద్యంగా సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు చేశారు.
పాడిపంటలు చల్లగా ఉండాలని, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతుల ఇంట సిరులు కురవాలనీ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని గ్రామస్తులు పోచమ్మ తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వాడియాల సర్పంచ్ చంద్రయ్య గౌడ్, మాజీ సర్పంచులు బృంగి సుధాకర్, వెంకటేష్ గౌడ్, టీఎన్జీవో జడ్చర్ల తాలూకా అధ్యక్షులు తిరుపతయ్య, మంగమ్మ శ్రీనివాసులు గ్రామ పెద్దలు, విజయ్ కుమార్, యాదయ్య, బొర్రా బాల్ రాజు, వెంకటయ్య, మధు, జంగయ్య, భీమయ్య, రాము, మల్లయ్య, రవికుమార్, నసీర్, బుచ్చమయ్య, కృష్ణయ్య, సుకుమార్, యువకులు, మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



