Monday, September 7, 2026
E-PAPER
Homeక్రైమ్అమ్రాబాద్ లో దారుణం..

అమ్రాబాద్ లో దారుణం..

- Advertisement -

భర్తను చంపిన భార్య, సహకరించిన పిల్లలు..?
నవతెలంగాణ-అచ్చంపేట
అమ్రాబాద్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను భార్య హత్యచేసింది. పోలీసులు స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. భర్త బుర్రాన్ ను చంపిన భార్య, హత్యకు ఇద్దరు కుమారులు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య చేసి మృతదేహాన్ని గోన సంచిలో మూటకట్టి బయటికి తరలించే ప్రయత్నం చేశారు. సాధ్యం కాకపోవడంతో మృతదేహాన్ని మూట కట్టిన గోనె సంచిని ఇంట్లోనే వదిలేసి పరారయ్యారు. అయితే గోనెసంచిలోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటితాళం తీసి గోనెసంచిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాల కారణంగానే భర్తను చంపినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ ఎస్సై హనుమంత్ రెడ్డి  వెల్లడించారు. కనిపించకుండా పోయిన భార్య, ఇద్దరు కుమారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -