Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం హామీలను అమలు చేయాలంటూ వినతి 

ప్రభుత్వం హామీలను అమలు చేయాలంటూ వినతి 

- Advertisement -

నవతెలంగాణ – మర్రిగూడ 
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జిసి మున్నయ్య కు రాష్ట్ర మజీ తాడి కార్పొరేషన్ చైర్మన్,సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్ తో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడగానే 100  రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం,ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే ఇచ్చన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు,మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్,రైతు బధు సమితి మండల మాజీ కన్వీనర్ బచ్చు రామకృష్ణ,మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య,కట్కూరు వెంకటేశం,కొలుకులపల్లి యాదయ్య,అంతిరెడ్డి,శ్రీరాములు,పందుల యాదయ్య, ఊరు పక్క నగేష్,సర్పంచులు వల్లంల సంతోష్ యాదవ్,రొక్కం భాస్కర్ రెడ్డి,సీతారాం నాయక్,డి ఎస్,కొంపల్లి నాగరాజు,గుంటోజు పరిపూర్ణ చారి,వెంకటేష్,మాజీ ప్రజా ప్రతినిధులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -