Monday, September 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి 14 ఫిర్యాదులు

ప్రజావాణికి 14 ఫిర్యాదులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 14 ఫిర్యాదులు స్వీకరించారు.వివిధ సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. వీటిలో పంచాయతీకి సంబంధించినవి 3 ఫిర్యాదులు,విద్యుత్ సమస్యపై 1 ఫిర్యాదు ఉండగా.. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులు 10 వినతిపత్రాలను సమర్పించారు. ప్రజలు అందజేసిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్, ఎమ్మార్వో ఆంజనేయులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -