Monday, September 7, 2026
E-PAPER
Homeమానవిఈ జాగ్రత్తలు లేకపోతే

ఈ జాగ్రత్తలు లేకపోతే

- Advertisement -

వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల వంటింట్లో నిల్వ ఉంచిన కిరాణా సరుకులు, ముఖ్యంగా ఉప్పు, పప్పులు, పిండి పదార్థాలు త్వరగా పాడవుతాయి. ఉప్పు తేమను పీల్చుకుని నీరులా మారడం, పప్పులలో పురుగులు, బూజు పట్టడం చాలా ఇళ్లల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య. ఈ వర్షాకాలంలో సరుకులు పాడవకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంచే చిట్కాలను తెలుసుకుందాం.
వాతావరణంలోని తేమను ఉప్పు చాలా వేగంగా పీల్చుకుంటుంది. ఉప్పు నిల్వ ఉంచే జాడీ లేదా డబ్బాలో కొద్దిగా బియ్యం గింజలను లేదా ఒక చిన్న గుడ్డ ముక్కలో బియ్యం కట్టి వేయాలి. బియ్యం తేమను పీల్చేసుకుని ఉప్పు పొడిపొడిగా ఉండేలా చేస్తుంది.
కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు నిల్వ చేసే డబ్బాల్లో నాలుగైదు బిర్యానీ ఆకులు లేదా ఎండుమిరపకాయలు వేసి ఉంచాలి. వాటి ఘాటైన వాసనకు పప్పులకు పురుగులు, తెగుళ్లు అస్సలు చేరవు. ఎండబెట్టిన వేప ఆకులను పప్పుల డబ్బాల్లో అడుగున, పైన వేయడం వల్ల సహజసిద్ధమైన యాంటీ బాక్టీరియల్ రక్షణ లభిస్తుంది.
కిరాణా సరుకులను సాధారణ కవర్లలో ఉంచకుండా నాణ్యమైన ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వ చేయాలి. సరుకులు తీసేటప్పుడు తడి లేని పొడి చెంచాలను మాత్రమే ఉపయోగించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -