టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఎట్టకేలకు స్పందించారు. పార్టీలోని నాయకుల అసంతృప్తిపై మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. ఇక్కడ నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పొచ్చు.. అదే సమయంలో పార్టీ క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం” అని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చామని, అయితే కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా ఆలస్యమైందని వివరించారు. సెప్టెంబర్ నెలలో పార్టీలోని సమస్యలన్నీ పూర్తిగా పరిష్కారమవుతాయని, నాయకుల అసంతృప్తి కూడా తొలగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ వాస్తవమే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



