21 నుంచి మిల్లర్ల రిలే నిరాహార దీక్షలు
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
జూలకంటి రంగారెడ్డి
లిఖితపూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమణ : మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
రాష్ట్రంలో రైస్ మిల్లర్స్ , కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై జూలకంటి రంగారెడ్డి మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి, పౌరసరఫరాల శాఖ మంత్రికి శనివారం లేఖ రాశారు. రాష్ట్రంలో వరి ప్రధానమైన పంట అని, దీన్ని ఆధారంగా చేసుకొని వేల సంఖ్యలో రైస్ మిల్లులు ఏర్పడ్డాయన్నారు. హమాలీలు, దిన కూలీలు, ఆపరేటర్లు, గుమస్తాలు, ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ వేల సంఖ్యలో వీటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఇలాంటి ఇండస్ట్రీ కుంటుపడకుండా, బంద్ కాకుండా నిరంతరం నడవడానికి ధాన్యం ఖరీదులు, సీఎంఆర్ డెలివరీలు సజావుగా జరుగుతున్నాయన్నారు. నూటికి ఒక్కరో.. ఇద్దరో రైస్ మిల్లర్స్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా.. ప్రయివేట్ మార్కెట్‌లో అమ్ముకొని ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. ఇటీవల సీఎంఆర్ బియ్యం అందడం లేదని అధికారులు రైస్ మిల్లర్లపై దాడులు జజరిపి చార్ట్ ఫాల్ ఉన్నచోట కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సీఎంఆర్ ధాన్యం మిల్లులకు పంపినప్పుడు తేమ, తాలు, రంగు మారిన ధాన్యం వస్తున్నా మిల్లర్లపై ఒత్తిడి చేసి దిగుమతి చేసుకుంటున్నామని, అదేవిధంగా మిల్లింగ్ చేయగా 60 శాతం అంతకంటే తక్కువ అవుటర్ వస్తుందని, అయినా కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేషియో 68శాతం బియ్యం ఇప్పటివరకు డెలివరీ చేశామని మిల్లర్లు చెబుతున్నట్టు పేర్కొన్నారు.
గోదాములలో ధాన్యం నిల్వలు పేరుకుపోయి.. ధాన్యం రంగు మారి పాడైపోతే.. ఆ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐ వారికి పంపిస్తే తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితిలో వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి నిరవధికంగా రైస్ మిల్స్ ను బంద్ చేయాల్సి వచ్చిందన్నారు. బంద్‌కు కార్మికులు, రైతులు మద్దతిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో కూడిన మంత్రివర్గ సబ్ కమిటీ ఇటీవల చర్చలకు ఆహ్వానించిందని, అయినా పరిష్కారం కాలేదని అన్నారు. లిఖితపూర్వకంగా హామీనిస్తేనే సమ్మె విరమణ చేస్తామని లేకపోతే ఈ నెల 21 నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడ్తామని మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్స్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మంత్రివర్గం ఉపసంఘంతో జరిగిన చర్చల్లో ఎలాంటి పరిష్కారమూ రాకపోవడం వల్లనే పోరాటం చేస్తున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం ప్రకటించిందని తెలిపారు.
మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



