నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఐ చెల్లింపులపై మోడీ ప్రభుత్వం చార్జీలు విధించిన విషయం తెలిసిందే. రూ.2000 ధాటిన మర్చంట్ పేమెంట్ లపై 0.4శాతం చార్జీలు వసూలు చేయనుంది.వచ్చే నెల అక్టోబర్ 16నుంచి చార్జీలు వర్తించనున్నాయి. తాజాగా మోడీ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. పెట్రోల్ బంక్ నిర్వహకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చార్జీల నుంచి తమకు మినహయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో శనివారం మధ్యప్రదేశ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. ప్రకటించింది.
అక్టోబర్ 16 నుండి రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన UPI చెల్లింపులను స్వీకరించబోమని వెల్లడించింది.ఇంధన పంపు డీలర్లు చాలా తక్కువ లాభాల మార్జిన్‌తో పనిచేస్తుండటం వల్ల, ఈ అదనపు భారాన్ని భరించలేమని,అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. సగటున ప్రతి పెట్రోల్ పంప్ వద్ద సుమారు 100 మంది వినియోగదారులు రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు జరుపుతుంటారు. దీనివల్ల రోజుకు సుమారు రూ. 590 నష్టం వాటిల్లుతుంది, అంటే నెలకు దాదాపు రూ. 17,700 భారం పడుతుంది,” అని సింగ్ పేర్కొన్నారు.



