Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత

గచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డివిజన్‌లోని గోపన్‌పల్లిలో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ భవనం శుక్రవారం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించి క్రేన్ సహాయంతో కూల్చివేత పనులు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -